ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయాలి
● డీఎంహెచ్‌ఓ సాంబశివరావు
గీసుకొండ: అధికారులు, వైద్యులు, సిబ్బంది జిల్లాలో జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతం చేయడానికి కృషి చేయాలని డీఎంహెచ్‌ఓ బి. సాంబశివరావు అన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సమీక్షా సమావేశం ని ర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ఇటీవల నూతనంగా నియమితులైన డిప్యూటీ సివిల్ సర్జన్లకు ప్రోగాం అధికారులుగా బాధ్యతలు అప్పగించామని, ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడానికి చిత్తశుద్ధితో పని చేయాలన్నారు. ప్రతీఒక్కరు సమయపాలనను పాటించాలని, లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. సంక్రమిత, అసంక్రమిత వ్యాధుల నివారణ కార్యక్రమ అధికారి డాక్టర్ సయ్యద్ ఇఫ్తార్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లాలో 30 ఏళ్లు దాటిన ప్రతీఒక్కరిని స్క్రీనింగ్ చేయాలన్నారు. మాతాశిశు సంరక్షణ కార్యక్రమ అధికారి ప్రసన్న ల క్ష్మి, క్షయవ్యాధి నియంత్రణ కార్యక్రమ అధికారి స రిత, అనిల్‌కుమార్, వైద్యాధికారులు పాల్గొన్నారు.


