19 నుంచి సర్పంచ్‌లకు శిక్షణ
గీసుకొండ: నూతనంగా ఎన్నికై న సర్పంచ్‌లకు గ్రామపంచాయతీల పాలన, చట్టాలపై ఈ నెల 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డీపీఓ కటకం కల్పన తెలిపారు. మంగళవారం ఆమె జాతీయ ఆదర్శగ్రామంలోని ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహించే శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. తొలివిడతలో భాగంగా గీసుకొండ, సంగెం, చెన్నారావుపేట మండలాలకు చెందిన 84 మంది సర్పంచ్‌లకు శిక్షణ ఇస్తామన్నారు. ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శృతి హర్షిత, ఎంపీఓ పాక శ్రీనివాస్, ట్రైనింగ్ మేనేజర్ కూసం రాజమౌళి, స్థానిక సర్పంచ్ కూసం స్వరూప, ఎన్‌ఐఆర్‌డీ నుంచి నిమ్మల శేఖర్, పంచాయతీ కార్యదర్శి రమ్యకుమారి, ప్రశాంత్, క్లస్టర్ ఆపరేటర్ వేల్పుల సురేశ్ పాల్గొన్నారు.


