కొలిచిన వారికి కొంగు బంగారమై..
నర్సంపేట రూరల్: కొలిచిన వారికి కొంగు బంగా రంగా నిలుస్తున్న జాతర శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి జాతర. ప్రతీ ఏడాది సంక్రాంతి పర్వదినం సందర్భంగా జాతర వైభవంగా నిర్వహించడం ఆనవా యితీ. జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. నర్సంపేట డివిజన్‌లో ని చెన్నారావుపేట మండలం లింగగిరి గ్రామంలో వెలిసిన లక్ష్మీ చెన్నకేశవ స్వామి జాతర ప్రతీ సంవత్సరం నాలుగురోజుల పాటు నిర్వహిస్తారు. డిసెంబర్ మార్గశిర మాసం నుంచి జనవరి కృష్ణమాసం వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయని ప్రధాన అర్చకుడు సుదర్శనాచార్యులు తెలిపారు. ఈనెల 13న శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి వార్షిక బ్రహ్మోత్సవం, విశ్వక్సేన ఆరాధన, పుణ్యావచనము, అభిషేక మహోత్సవం, 14న ఏకాదశి భోగి పండుగ గోదా రంగనాథ స్వామి కల్యాణం, 15న ద్వాదశి సంక్రాంతి మహాజాతర, ప్రభ బండ్లు తిరుగుట, నృత్య ప్రదర్శనలు, కోలాటములు, భక్తులు దర్శనం, 16న కనుమ రోజు మహాజాతర, శోభాయాత్ర జరుగుతుందన్నారు. కాగా జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ చైర్‌పర్సన్, సర్పంచ్ మెడబోయిన రజిత తెలిపారు.
నేటి నుంచి లింగగిరిలో లక్ష్మీ చెన్నకేశవస్వామి జాతర
భారీగా తరలిరానున్న భక్తులు
కొలిచిన వారికి కొంగు బంగారమై..


