భూ సమస్యలు పెండింగ్ ఉండొద్దు
న్యూశాయంపేట: భూ సమస్యలు ఎట్టి పరిస్థితిలో పెండింగ్ ఉండొద్దని, పింఛన్లు, గృహాలు, ఉపాధి, సంక్షేమ పథకాలపై వచ్చిన వినతులు పరిశీలించి అర్హత మేరకు పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొని వినతులు స్వీకరించారు. స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 129 దరఖాస్తులు రాగా ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, డీడబ్ల్యూఓ రాజమణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ప్రజావాణిలో 129 ఫిర్యాదులు


