పోటాపోటీగా చేరికలు
నర్సంపేట: జిల్లాలోని ప్రతిష్టాత్మకమైన నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. ఆయా వార్డుల్లో పలుకుబడి ఉన్న వారిని తమ పార్టీలో చేర్పించుకునేందుకు ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈనెల 9న బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ కౌన్సిలర్ కుటుంబం బండి భారతిరమేష్, సందీప్‌లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. బీఆర్‌ఎస్ పార్టీలోకి దొంతి మాధవరెడ్డి అనుచరుడిగా కొనసాగిన మాజీ ఎంపీపీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు తన పదవులకు, పార్టీకి సోమవారం రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. బీజేపీలో కూడా కొందరు గోగుల రాణాప్రతాప్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరడంతో మున్సిపల్‌లో తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రధాన పార్టీల నాయకులు దృష్టి సారించి నట్లు అయింది. మరికొంత మంది ప్రధాన నాయకులను తమ పార్టీలో చేర్పించుకునేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తుండడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా జరుగనున్నట్లు తెలుస్తుంది.
పోటాపోటీగా చేరికలు


