● యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ
పెద్దపల్లి తేజస్వీప్రకాశ్
నర్సంపేట: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు అవకాశం కల్పిస్తామని వరంగల్ రూరల్ జిల్లా ఇన్‌చార్జ్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పెద్దపల్లి తేజస్వీప్రకాశ్ అన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో శుక్రవారం యువజన కాంగ్రెస్ జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కొరివి పరమేశ్‌పటేల్, యువజన కాంగ్రెస్ నర్సంపేట నియోజకవర్గ అధ్యక్షుడు తుమ్మలపల్లి సందీప్, వరంగల్ తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు మహ్మద్ సలీమ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మోడెం ఎల్లగౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పొదిల నరేశ్, నల్లబెల్లి మండల అధ్యక్షుడు పురుషోత్తం సురేశ్, నర్సంపేట మండల అధ్యక్షుడు బొంత రంజిత్ తదితరులు పాల్గొన్నారు.