
అదుపు తప్పి ఆటో బోల్తా..
ఐనవోలు: అదుపు తప్పి ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం సాయంత్రం మండలంలోని పంథిని శివారులో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాలకు చెందిన మహిళా కూలీలు వరి నాటు పనులు ముగించుకుని కట్య్రాలకు బయలు దేరారు. ఈ క్రమంలో పంథిని శివారు వరంగల్–ఖమ్మం రహదారిపై ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సమయంలో ఆటోలో 14 మంది ప్రయాణిస్తుండగా 10 మందికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఈఎంటీ రాజు, పైలెట్ కొండ తిరుపతి ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
పది మందికి గాయాలు
పంథిని శివారులో ఘటన