
వైద్యులు అప్రమత్తంగా ఉండాలి
పరకాల: పారిశుద్ధ్యం విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి వైద్యాధికారులను ఆదేశించారు. వైద్యులు నిత్యం అందుబాటులో ఉంటూ.. కావాల్సినన్ని మందులు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. బుధవారం ఆయన డీఎంహెచ్‌ఓ అప్పయ్యతో కలిసి పరకాల ఏరియా ఆస్పత్రిని పరిశీలించా రు. ఆస్పత్రి ఆవరణలో పారిశుద్ధ్య పనులతో పాటు ఫీవర్ వార్డు, ఎన్సీడీ క్లినిక్, ఫార్మసీ విభాగం, సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకున్న చర్యల గురించి ఆస్పత్రిలో అందుతున్న వైద్యాన్ని వివిధ విభాగాల సేవల్ని తెలుసుకున్నారు. అనంతరం ఆ యన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలు అవగాహన కలిగి ఉండాలని, ము ఖ్యంగా నీరు శుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సీజనల్ మెడికల్ క్యాంపులు, ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించా రు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ నాగార్జున, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గౌతమ్ చౌహాన్, అడిషనల్ డీఎంహెచ్‌ఓ, మలేరియా అధి కారి డాక్టర్ శ్రీపాల్, వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
108 వాహనం తనిఖీ
పరకాల మండల కేంద్రానికి చెందిన 108 వాహనాన్ని డీఎంహెచ్‌ఓ డాక్టర్ అప్పయ్య బుధవారం తనిఖీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో అందించిన సేవలతోపాటు వాహనంలో ఉన్న వైద్య పరికరాల ను క్షణ్ణంగా పరిశీలించారు. ఏదైనా ప్రమాద సమాచారం అందగానే నిర్లక్ష్యం చేయకుండా సమయానికి చేరుకోవాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో 108 వాహనం ఈఎంటీ మహేందర్, పైలట్ పామలు రాజు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ప్రాజెక్ట్
డైరెక్టర్ డాక్టర్ వాసం వెంకటేశ్వర్‌రెడ్డి
పరకాల సివిల్ ఆస్పత్రి పరిశీలన

వైద్యులు అప్రమత్తంగా ఉండాలి