
మాట్లాడుతున్న కలెక్టర్ సిక్తా పట్నాయక్
కలెక్టర్ సిక్తా పట్నాయక్
హన్మకొండ అర్బన్: నగరంలోని నయీంనగర్ నాలా అభివృద్ధి పనుల్లో వేగం పెంచి వానాకాలం ప్రారంభం నాటికి పనులు పూర్తయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి నయీంనగర్ నాలా అభివృద్ధి పనులపై సంబంధింత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాలా ఇరువైపులా కొనసాగుతున్న పనుల వివరాల్ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పూడికతీత పనులు, అభివృద్ధి పనుల సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులు, పనులకు సంబంధించి యాక్షన్ ప్లాన్, బ్రిడ్జి నిర్మాణం తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఈసందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. నాలా అభివృద్ధికి సంబంధించిన పనులపై యాక్షన్ ప్లాన్ రూపొందించాలన్నారు. అభివృద్ధి పనుల్లో వేగం పెంచేందుకు అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. జూన్ 15లోగా.. నాలా పనులు పూర్తి చేయాలని సూచించారు. హనుమకొండ ఆర్డీఓ వెంకటేశ్, తహసీల్దార్ విజయ్‌కుమార్, జీడబ్ల్యూఎంసీ ఈఈ రాజయ్య, ఇరిగేషన్ ఎస్‌ఈ వెంకటేశ్వర్లు, ఈఈ అంజనేయులు పాల్గొన్నారు.