విజ్ఞాన వెలుగులు | - | Sakshi
Sakshi News home page

విజ్ఞాన వెలుగులు

Nov 10 2026 12:37 AM | Updated on Nov 10 2026 12:37 AM

పటిష్ట బందోబస్తు

గ్రామీణ విద్యార్థులకు
శాసీ్త్రయ దృక్పథం, పరిశోధన ఆలోచనలను పెంపొందించాలి

● బిర్లా సైన్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో విద్యార్థుల కోసం ప్రత్యేక శిక్షణ

● కోస్గిలో సైన్స్‌ మ్యూజియం

ప్రారంభోత్సవంలో

సీఎం రేవంత్‌రెడ్డి

● 106 ఇంటారాక్టివ్‌ సైన్స్‌

ప్రదర్శనలతో విజ్ఞానం పెంపు

కోస్గి: గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని చేరువ చేయడంతో పాటు వారిలో శాసీ్త్రయ దృక్పథం, పరిశోధనాత్మక ఆలోచనా విధానాన్ని పెంపొందించడమే లక్ష్యం అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు నారాయణపేట జిల్లా కోస్గిలో రూ.6.6 కోట్లతో 106 ఇంటారాక్టివ్‌ సైన్స్‌ ప్రదర్శనలను నిర్మించిన సర్‌ సీవీ రామన్‌ సైన్స్‌ మ్యూజియంను ఆదివారం సీఎం ప్రారంభించారు. అంతకు ముందు నారాయణపేట కలెక్టర్‌ ప్రియాంక సీఎంకు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. సైన్స్‌ మ్యూజియంలో సీవీ రామన్‌ విగ్రహానికి వారు నివాళులర్పించారు. ఫిజిక్స్‌ అండ్‌ ఫన్‌ సైన్స్‌ గ్యాలరీ, బయాలజీ అండ్‌ లైఫ్‌ సైన్స్‌ గ్యాలరీ, మేథమెటిక్స్‌ గ్యాలరీ, ఖగోళశాస్త్రం గ్యాలరీ, ప్రముఖ శాస్త్రవేత్తల విగ్రహాలు, డిజిటల్‌ టచ్‌ స్క్రీన్‌ తదితర వాటిని సందర్శించారు. విజ్ఞానశాస్త్ర పరికరాలు, వాటి నమునాలు, ఇంటారాక్టివ్‌ ప్రదర్శనలు, వాటి పనితీరు, ప్రత్యేకతలు, విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను జిల్లా సైన్స్‌ అధికారి, కోస్గి బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు సీఎంకు వివరించారు. విద్యార్థులు పాఠ్య పుస్తకాల్లోని శాసీ్త్రయ సిద్ధాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించి.. ప్రయోగాల ద్వారా అర్థం చేసుకొనే అరుదైన అవకాశాన్ని మ్యూజియం కల్పిస్తుందన్నారు. విద్యార్థుల్లో పరిశీలనాశక్తి, ప్రశ్నించేతత్వం, విమర్శనాత్మక ఆలోచనను పెంపొందించడంతోపాటు పరిశోధనలు, నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తి కలుగుతోందన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విజ్ఞాన వనరులను చేరువ చేయడం ద్వారా భావి శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులుగా ఎదిగేందుకు కోస్గిలోని మ్యూజియం ప్రేరణగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. బీఎం బిర్లా సైన్స్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో రూ.6.6 కోట్ల వ్యయంతో సైన్స్‌ మ్యూజియాన్ని రూపొందించగా.. ఇందులో హండ్‌– ఆన్‌ శాసీ్త్రయ పరికరాలు, ప్రత్యేక విజ్ఞాన ప్రదర్శనల ఏర్పాటుకు రూ.2.5 కోట్లు కేటాయించారు. కార్యక్రమంలో ఎకై ్సజ్‌, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి, డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ నవీన్‌ నికోలస్‌, ఆర్జేడీ సోమిరెడ్డి, అదనపు కలెక్టర్‌ శ్రీను, ఎస్పీ డాక్టర్‌ వినీత్‌, కడా ప్రత్యేకాధికారి వెంకట్‌రెడ్డి, బిర్లా సైన్స్‌ సెంటర్‌ డైరెక్టర్‌ మృత్యుంరెడ్డి, ప్రాజెక్టు ఆఫీసర్‌ సుబ్రమణ్యం, డీఈఓ గోవిందరాజులు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ విజయ్‌కుమార్‌, మండలాధ్యక్షుడు రఘువర్ధన్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, కమిషనర్‌ నాగరాజు తదితరలు పాల్గొన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి కోస్గి పర్యటన నేపథ్యంలో భద్రత, బందోబస్తు ఏర్పాట్లను జోగుళాంబ జోన్‌ ఇన్‌చార్జి డీఐజీ చందనాదీప్తి, నారాయణపేట ఎస్పీ డాక్టర్‌ వినీత్‌ పర్యవేక్షించారు. అధికారులకు భద్రతాపరంగా పలు సూచనలు చేశారు. అధికారులు సమన్వయంతో నిర్వహించిన బందోబస్తు ఫలితంగా కోస్గిలో ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పర్యటనను విజయవంతంగా నిర్వహించడంలో కృషిచేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో వికారాబాద్‌ ఎస్పీ స్నేహ మెహ్రా, ఏఎస్పీ రియాజ్‌ హుల్‌హక్‌, డీఎస్పీలు మహేష్‌, లింగయ్య, సీఐలు సైదులు, భగవంతురెడ్డి, రాంలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement