ప్రజావాణి అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజావాణి అర్జీలు పెండింగ్‌లో ఉంచొద్దు

Nov 10 2026 12:37 AM | Updated on Nov 10 2026 12:37 AM

వనపర్తి: ప్రజావాణికి వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) ఎన్‌.ఖీమ్యా నాయక్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) వినోద్‌ కుమార్‌తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ఒకవేళ ఫిర్యాదుకు సంబంధించిన అంశం తమ శాఖ పరిధిలో లేకపోతే సంబంధితశాఖకు లేఖ రాస్తూ పంపించాలన్నారు. పరిష్కరించలేని అంశం ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు పంపించడం లేదా ఏ నిబంధన ప్రకారం పరిష్కారం చేయలేమో ఫిర్యాదుదారుడికి తెలియజేయాలి తప్ప.. తమ వద్ద పెండింగ్‌లో ఉంచుకోవద్దని సూచించారు. అలాగే సీఎం, జిల్లా మంత్రి ప్రజావాణి నుంచి వచ్చి పెండింగ్‌లో ఉన్న అర్జీలను సైతం సత్వరం పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నేటి ప్రజావాణిలో 18 దరఖాస్తులు, ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 1 దరఖాస్తు వచ్చినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రాంరెడ్డి, జెడ్పీ సీఈవో యాదయ్య, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ తిరుపతయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement