ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన వేగవంతం | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీ ఓటరు దరఖాస్తుల పరిశీలన వేగవంతం

Nov 6 2026 12:38 AM | Updated on Nov 6 2026 12:38 AM

వనపర్తి: పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి 15 రోజుల్లోగా పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి రాంరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెనన్స్‌ నిర్వహించగా.. జిల్లా కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్‌న్స్‌ హాల్‌ నుంచి డీఆర్వో పాల్గొన్నారు. అనంతరం జిల్లా ఎన్నికల విభాగం అధికారులతో సమావేశమై మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 26,500 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 5,500 దరఖాస్తులను ఇప్పటికే ఆమోదించినట్లు చెప్పారు. మిగిలిన వాటిని కూడా సంబంధిత అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అదేవిధంగా జిల్లాలో ఎలక్టోరల్‌ లిటరసీ క్లబ్‌లను ఏర్పాటు చేసి వాటి ద్వారా విద్యార్థులు, యువతకు ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతపై అవగాహన కల్పించాలన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో వ్యాసరచన, క్విజ్‌ పోటీలు నిర్వహించాలని కోరారు. ఈ నెల 28లోగా పోటీలను విజయవంతంగా పూర్తి చేసేలా సంబంధిత నోడల్‌ అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం, డీపీఆర్వో సీతారాంనాయక్‌, డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement