యాసంగి సాగు కష్టమే..! | - | Sakshi
Sakshi News home page

యాసంగి సాగు కష్టమే..!

Nov 2 2026 12:17 AM | Updated on Nov 2 2026 12:17 AM

అమరచింత: ఎల్‌నినో ప్రభావంతో వానాకాలంలో ఆశించిన మేర వర్షాలు కురవక సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదై జలాశయాలు, చెరువులు, కుంటలు నిండలేదు. సాగుచేసిన పంటలకు చివరి దశలో సరిపడా నీరందక వట్టిపోవడంతో చేతికందే పరిస్థితులు కనిపించడం లేదు. ప్రస్తుతం జిల్లాలో నీటి వనరుల లభ్యతను దృష్టిలో ఉంచుకొని వ్యవసాయశాఖ అధికారులు యాసంగి ప్రణాళికను రూపొందించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి చాలావరకు సాగు విస్తీర్ణం తగ్గుతున్నట్లు అంచనాకు వచ్చారు. గతేడాది యాసంగిలో జిల్లావ్యాప్తంగా వరితో పాటు వివిధ రకాల పంటలు 3 లక్షల ఎకరాల్లో సాగుకాగా.. ఈ ఏడాది 1.94 లక్షల ఎకరాల్లో మాత్రమే పంటలు సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. గతేడాది 2.10 లక్షల ఎకరాల్లో వరి సాగుకాగా.. ఈ ఏడాది లక్షకు తగ్గనున్నట్లు అంచనా వేస్తున్నారు.

అమరచింత మండలం నందిమళ్ల చెరువులో తగ్గిన నీటిమట్టం

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం..

యాసంగిలో వరికి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. వ్యవసాయ క్లస్టర్ల వారీగా శాస్త్రవేత్తలతో కలిసి యాసంగిలో ఎలాంటి పంటలు సాగు చేస్తే లబ్ధి పొందుతారనే విషయాలను వివరిస్తున్నాం.

– అరవింద్‌, ఏఓ, అమరచింత

ఆరుతడి పంటలే మేలు..

యాసంగి సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీ సుకోవాలనే విషయాల ను రైతులకు తెలియజేసే ందుకు గ్రామాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. తక్కువ నీటితో సాగ య్యే పప్పుదినుసుల పంటలు సాగు చేసుకోవాలని సూచిస్తున్నాం. బోరుబావుల్లో నీటిలభ్యత ఉంటే వరి వేయాలని వివరిస్తున్నాం.

– ఆంజనేయులు, జిల్లా వ్యవసాయ అధికారి

ఎల్‌నినో ప్రభావం.. కనుమరుగైన వర్షాలు

జలాశయాలు, చెరువుల్లో

తగ్గుతున్న నీటిమట్టం

అడుగంటుతున్న బోరుబావులు

ఆరుతడి పంటలు సాగు చేయాలని సూచిస్తున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement