అమరచింత: గురుబోధన విని ఆచరిస్తే మానవజన్మ సుకృతమవుతుందని హైదరాబాద్ శ్రీ గాయత్రీ పీఠం పీఠాఽధిపతి కాతేంద్రస్వామి అన్నారు. మండలంలోని నాగల్‌కడ్మూర్‌లో మూడురోజులుగా దేవేంద్రచార్యుల ఆరాధనోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఆయన పాల్గొని భక్తులకు ప్రవచనాలు వినిపించారు. సృష్టిలో మానవజన్మ ఎంతో గొప్పదని.. అలాంటి జన్మను సార్థకం చేసుకునేందుకు దైవత్వం పొందేందుకు మనిషి ఆరాటపడాలన్నారు. సంసారమనే ముసుగులో మనిషి తనలోని దైవత్వాన్ని అంధకారంలో నెట్టేస్తూ తాను కూడా నరక ఉబిలో పడిపోతున్నారని తెలిపారు. గురువును గౌరవించాలని, గురుబోధనలు పాటించాలని పిలుపునిచ్చారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల సేవలో తరిస్తూనే తన జన్మకు మూలం ఏమిటో అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు.
కనులపండువగా స్వామివారి పల్లకీసేవ..
ఆరాధనోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం రాత్రి స్వామివారి పల్లకీసేవ కనులపండువగా ని ర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
● మఠంలో జరిగిన ఉమ్మడి జిల్లాస్థాయి భజన పోటీలు ఆదివారం ముగిశాయి. మొత్తం 30 భజన బృందాలు పాల్గొన్నాయి. మొదటి బహుమతిని శ్రీ బాలాంజనేయ భజన మండలి (మహబూబ్‌నగర్), రెండోబహుమతి లక్ష్మీచెన్నకేశవస్వామి భజన మండలి (గంగాపూర్), మూడోబహుమతి వేంకటేశ్వర భజనమండలి (నర్వ) కై వసం చేసుకున్నాయి. విజేతలకు నగదు బహుమతులు అందజేశారు.


