వనపర్తిటౌన్: జిల్లాలో ఆదివారం నిర్వహించిన జాతీయ ప్రతిభ ఉపకార వేతన (ఎన్‌ఎంఎంఎస్) అర్హత పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రంలోని మూడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 642 మంది విద్యార్థులకుగాను 606 మంది హాజరుకాగా.. 36 మంది గైర్హాజరయ్యారు. బాలుర ఉన్నత పాఠశాలలో 214 మందికిగాను 202 మంది, బాలికల ఉన్నత పాఠశాలలో 215 మందికి 202, చాణక్య ఉన్నత పాఠశాలలో 213 మందికిగాను 202 మంది హాజరయ్యారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్ష జరిగింది. సిబ్బంది విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించి కేంద్రాల్లోకి అనుమతించారు. పరీక్షల నిర్వహణను ఇన్‌చార్జ్ డీఈఓ యాదయ్య, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్‌న్స్ గణేష్‌కుమార్ పర్యవేక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.


