వనపర్తి రూరల్: పెబ్బేరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 3న జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా సబ్ జూనియర్ బాలుర కబడ్డీ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు పి.వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి ఎం.కురుమయ్య, చైర్మన్ పద్మజారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. 13.12.2010 తర్వాత జన్మించి, 60 కిలోలలోపు బరువు కలిగిన బాలురు అర్హులని.. ఆసక్తి గల క్రీడాకారులు ఆధార్‌కార్డు, బోనఫైడ్ సర్టిఫికెట్, ఎస్‌ఎస్‌సీ మెమో ఒరిజినల్, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 వరకు హాజరుకావాలని పేర్కొన్నారు. ఎంపికై న క్రీడాకారులు నవంబర్ 12 నుంచి 14వ తేదీ వరకు వికారాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల్లో పాల్గొంటారన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌నంబర్లు 70130 505502, 96409 38389 సంప్రదించాలని తెలిపారు.
నిత్యావసరాల ధరలు అదుపు చేయాలి
అమరచింత: బ్లాక్‌మార్కెట్‌లో బియ్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్న రైస్‌మిల్లులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించాలని.. పెరుగుతున్న నిత్యావసరాల ధరలను అదుపు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ అన్నారు. ఆదివారం మండలకేంద్రంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ కరువు పరిస్థితులు నెలకొన్నాయని.. రాష్ట్రంలోని ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. రేషన్ దుకాణాల ద్వారా ప్రతి ఒక్కరికి 12 కిలోల ఉచిత బియ్యంతో పాటు 14 రకాల సరుకులు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు శంకర్, బుచ్చన్న, శ్రీనివాసులు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆర్చరీ పోటీలకు ఎంపిక
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పీయూలో ఆర్చరీ విభాగం సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పోటీలకు ఆదివారం ఎంపికలను నిర్వహించారు. ఇందులో ఆరుగురు విద్యార్థులు ఎంపికవగా.. వీసీ శ్రీనివాస్ బహుమతులను అందజేశారు. ఇక్కడ ఎంపికై న వారు డిసెంబర్‌లో కర్ణాటకలోని మంగళూరు యూనివర్సిటీలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


