జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం మహాత్మాగాంఽధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్, పోలీసు అధికారులు, సిబ్బంది మహాత్ముడి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ప్రారంభించి ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి ఉద్యమాల్లో ఆయన నాయకత్వం ఎంతో ముఖ్యమైందని, సత్యం వీడని నాయకుడని కొనియాడారు. అహింసా, శాంతి, స్వాతంత్య్ర ఉద్యమ పోరాటం నేటి సమాజానికి దిక్సూచి లాంటిదన్నారు. కార్యక్రమంలో రిజర్వ్ సీఐ శ్రీనివాసులు పలువురు ఎస్‌ఐలు, ఏఎస్‌ఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


