మహాత్ముడి పోరాటం చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

మహాత్ముడి పోరాటం చిరస్మరణీయం

Oct 3 2026 12:38 AM | Updated on Oct 3 2026 12:38 AM

వనపర్తి: దేశ స్వాతంత్య్రం కోసం మహాత్మాగాంధీ చేసిన పోరాటం చిరస్మరణీయమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గాంధీజీ సేవలు, దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను స్మరించుకున్నారు. గాంధీజీ సత్యం, అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిచెప్పారని ఎమ్మెల్యే తెలిపారు. దేశ స్వాతంత్య్రం కోసం ఆయన చేసిన పోరాటం, ప్రజలను ఏకతాటిపైకి తీసుకొచ్చిన తీరు, సామాజిక సమానత్వం కోసం చేసిన కృషి మరువలేదన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ.. సత్యం, అహింస, సేవ, స్వచ్ఛత వంటి విలువలను ఆచరణలో చూపిన గాంధీజీ ఆశయాలు నేటి తరానికి మార్గదర్శకమన్నారు. సమాజంలో సమానత్వం, సామరస్యం, సోదరభావం వెల్లివిరియాలన్న ఆయన ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళని చెప్పారు.

● కలెక్టరేట్‌లో నిర్వహించిన మహాత్మాగాంధీ జయంతి వేడుకల్లో కలెక్టర్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ పాల్గొని గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో పుర చైర్‌పర్సన్‌ మాధవి, వైస్‌ చైర్మన్‌ మధుసూదన్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement