క్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల మెరుగు | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో క్రమశిక్షణ, పట్టుదల మెరుగు

Oct 3 2026 12:38 AM | Updated on Oct 3 2026 12:38 AM

వనపర్తి: క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, పట్టుదల, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి అన్నారు. యువతలో ఆరోగ్యకర జీవనశైలిని పెంపొందించే లక్ష్యంతో శుక్రవారం గాంధీజయంతి సందర్భంగా పట్టణంలోని అభి ఏరీనా ఇండోర్‌ స్టేడియంలో జిల్లా యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌–2026 పోటీలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. బ్యాట్‌ చేతబట్టి కాసేపు ఆడి క్రీడాకారులను ఉత్సాహపర్చారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. క్రీడల్లో పాల్గొనడంతో ఆరోగ్యకర జీవనశైలి అలవర్చుకోవడంతో పాటు క్రీడాస్ఫూర్తి, క్రమశిక్షణ, జట్టుస్ఫూర్తి వంటి విలువలు పెంపొందుతాయని తెలిపారు. పోటీల్లో సుమారు 150 మంది క్రీడాకారులు పాల్గొనడం అభినందనీయమని.. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తి ప్రదర్శించాలని కోరారు. జిల్లాలో క్రీడల అభివృద్ధి, క్రీడా పోటీల నిర్వహణకు సహకరిస్తున్న అభి స్పోర్ట్స్‌ అరేనా నిర్వాహకుడు మురళీధర్‌ను కలెక్టర్‌ అభినందించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. డీవైఎస్‌ఓ సుధీర్‌రెడ్డి, తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి, క్రీడాకారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

వెదురు వస్తువుల

తయారీపై శిక్షణ

మన్ననూర్‌: వెదురుతో ఆకర్శనీయమైన పరికరాలు, వస్తువులు తయారు చేయడంలో పరిజ్ఞానం కలిగి ఉన్న ఆదివాసీ చెంచులు, మేదరులను ప్రోత్సహించేందుకు మాతృభూమి సంస్థ ముందుకు వచ్చిందని సంస్థ అధ్యక్షుడు ప్యారసాని రమాకాంత్‌ అన్నారు. శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని అప్పాపూర్‌లో గ్రామసభ నిర్వహించారు. అనంతరం సర్పంచ్‌ శివమ్మతో కలిసి నల్లమల అటవీ లోతట్టు ప్రాంతంలోని అప్పాపూర్‌, భౌరాపూర్‌, ఈర్లపెంట, మేడిమల్కల, సంఘిడి గుండాలు చెంచు పెంటలలో పర్యటించి చెంచుల జీవన విధానం తదితర అంశాల గురించి చర్చించారు. వెదురుతో వస్తువులు తయారు చేసేందుకు 1,500 మంది మేదరులు, చెంచులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. గతంలో విద్యుత్‌ సౌకర్యం లేని చెంచు పెంటలు, గూడేలలో సోలార్‌ లైట్లు అందజేయడం జరిగిందన్నారు. వచ్చే దసరా పండగకు రూ.10 లక్షల వ్యయంతో 100 సోలార్‌ వీధిలైట్లను ఆయా పెంటలలో అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement