● రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి
జూపల్లి కృష్ణారావు
వీపనగండ్ల: సింగోటం రిజర్వాయర్ నుంచి గోపల్‌దిన్నె రిజర్వాయర్‌కు లింక్ కెనాల్ నిర్మాణ పనులు పూర్తిచేసి 40 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని వల్లభాపురం సమీపంలో కాల్వ పనులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. చిన్నంబావి, వీపనగండ్ల మండలాల రైతులకు సాగు నీరు అందించడమేగాక భీమా కాల్వకు కూడా నీటిని సరఫరా చేస్తామని తెలిపారు. నిరంతరం పనులు కొనసాగుతాయని.. జూన్ నాటికి రైతులకు సాగు నీరు అందిస్తామని చెప్పారు. 22 కిలోమీటర్ల కాల్వ నిర్మాణానికిగాను నిర్వాసిత రైతులకు భూ సేకరణ డబ్బులు చెల్లించామని, రానివారికి కూడా త్వరలోనే ఇప్పించే ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి, సర్పంచ్‌లు సుదర్శన్‌రెడ్డి, రామన్‌గౌడ్, బండారి రాముడు, పార్టీ నాయకులు రామచంద్రారెడ్డి, కృష్ణప్రసాద్, రవీందర్‌రెడ్డి, కావలి మహేష్, గోపి, ధనుంజయ్య తదితరులు పాల్గొన్నారు.


