అధికారులు స్పందించడం లేదు.. | - | Sakshi
Sakshi News home page

అధికారులు స్పందించడం లేదు..

Oct 3 2026 12:38 AM | Updated on Oct 3 2026 12:38 AM

అధికారులు స్పందించడం లేదు.. భూములు స్వాధీనం చేసుకుంటాం..

ఆలయానికి చెందిన సుమారు 34 ఎకరాల భూమి కౌలు చెల్లించకపోవడం చాలా బాధాకరం. కొందరు రైతులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా.. అధికారులు స్పందించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. సర్వేనంబర్‌ 410తో పాటు ఇతర నంబర్లలోని భూములకు గతంలో కౌలు చెల్లించిన రైతులే ఇప్పుడు పూర్తిగా చేతులెత్తేశారు. దీంతో ఆలయ అభివృద్ధి, ధూప దీప నైవేద్యాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. అధికారులు స్పందించి సరిహద్దులు గుర్తించి భూములను స్వాధీనం చేసుకోవాలి. రైతుల ద్వారా కౌలు తీసుకోవాలి.

– విష్ణువర్ధన్‌రెడ్డి, ఆలయ చైర్మన్‌

అజ్జకొల్లు శ్రీ శివ రామాంజనేయస్వామి ఆలయ భూముల వ్యవహారం మా దృష్టికి వచ్చింది. గతంలో కౌలు వసూలు చేసిన మాట వాస్తవమే. ప్రస్తుతం రికార్డులను పరిశీలిస్తున్నాం. త్వరలోనే రెవెన్యూ, దేవాదాయశాఖ సంయుక్తంగా ప్రత్యేక బృందంతో సర్వే నిర్వహిస్తాం. కౌలు బకాయి పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం. ఆలయ ఆస్తులను పరిరక్షించడంలో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు.

– వాసు, ఎండోమెంట్‌ సూపర్‌వైజర్‌,

మహబూబ్‌నగర్‌

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement