లిఫ్ట్‌ నిర్వహణకు ప్రత్యేక రైతు కమిటీ | - | Sakshi
Sakshi News home page

లిఫ్ట్‌ నిర్వహణకు ప్రత్యేక రైతు కమిటీ

Aug 23 2026 5:38 AM | Updated on Aug 23 2026 5:38 AM

రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ

మంత్రి జూపల్లి కృష్ణారావు

చిన్నంబావి: చిన్నమారూర్‌ ఎత్తిపోతల పథకం ద్వారా ఆరు వేల ఎకరాల ఆయకట్టుకు సజావుగా సాగునీరు అందాలంటే రైతుల భాగస్వామ్యంతో ప్రత్యేక రైతుకమిటీ ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. శనివారం మండలంలోని చిన్నమారూర్‌ లిఫ్ట్‌ వద్ద ఆయకట్టు రైతులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. లిఫ్ట్‌ నిర్వహణలో చిన్న చిన్న సమస్యలు తలెత్తితే ప్రతిసారి అధికారుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా తక్షణం మరమ్మతు చేయించుకునే విధంగా కమిటీ పని చేయాలని సూచించారు. ఆయకట్టు రైతులు ఎకరాకు రూ.500 చొప్పున జమ చేసుకుంటే అత్యవసర మరమ్మతుకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు మరమ్మతు ఆలస్యమైతే సాగునీరు అందక రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుందని.. రైతులే లిఫ్ట్‌ను పరిరక్షించుకునే బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ యంత్రాంగంపై పూర్తిగా ఆధారపడకుండా ఆయకట్టు రైతులు ఐక్యంగా ముందుకుసాగాలన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ అధికారులు, కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్‌ యాదవ్‌, శ్రీలతరెడ్డి, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ రామచంద్రారెడ్డి, బీచుపల్లి యాదవ్‌, కృష్ణప్రసాద్‌ యాదవ్‌, విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement