కర్నెతండా లిఫ్ట్‌ను వెంటనే ప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

కర్నెతండా లిఫ్ట్‌ను వెంటనే ప్రారంభించాలి

Aug 21 2026 12:22 AM | Updated on Aug 21 2026 12:22 AM

ఖిల్లాఘనపురం: రైతుల కష్టాలు చూసి వారి కోరిక మేరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కర్నెతండా లిఫ్ట్‌ను మంజూరు చేయడంతో పాటు పనులు పూర్తి చేసినా.. నేటివరకు ప్రారభించకపోవడం కాంగ్రెస్‌ అసమర్థ పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కర్నెతండా సమీపంలోని ఎత్తిపోతలను రైతులు, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. అప్పట్లో ఏర్పాటు చేసిన పంపులు, లిఫ్ట్‌ దగ్గర ఉన్న మోటార్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎత్తు ప్రాంతంలోని రైతులకు సాగునీరు అందడం లేదని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఒప్పించి కర్నెతండా లిఫ్ట్‌ను మంజూరు చేయించామని.. నాడు రూ.76.16 కోట్లతో పూర్తి చేసి కేవలం సుమారు రూ.రెండు కోట్ల విలువైన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పనులు మాత్రమే పెండింగ్‌లో ఉంచామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర ఏళ్లు పూర్తి కావచ్చినా ఇప్పటి వరకు ప్రారంభించడం లేదని చెప్పారు. ఈ లిఫ్ట్‌ను వినియోగంలోకి తీసుకొస్తే 9 గిరిజన తండాలు, 6 గ్రామాల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని.. రైతుల ఒత్తిడితో గతేడాది వెట్‌రన్‌ నిర్వహించి మూసి వేశారని వివరించారు. ఇప్పటికై నా మొద్దు నిద్ర వదిలి మూడురోజుల్లో లిఫ్ట్‌ను ప్రారంభించి సాగునీటిని రైతులకు అందించకుంటే వేలాదిమంది రైతులతో కలిసి తామే ప్రారంభిస్తామని తెలిపారు. రైతులకు అన్యాయం జరిగేతే బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరన్నారు.

పోచమ్మతల్లికి ప్రత్యేక పూజలు..

మండల కేంద్రంలో జరిగిన పోచమ్మ బోనాల ఉత్సవంలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో జరుపుకొనే బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగమన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కృష్ణానాయక్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సామ్యానాయక్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రాళ్ల కృష్ణయ్య, పీన్యానాయక్‌, వాకిటి శ్రీధర్‌, నందిమళ్ల అశోక్‌ తదితరులు పాల్గొన్నారు.

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement