చివరి ఆయకట్టుకు సాగునీరు అందాలి | - | Sakshi
Sakshi News home page

చివరి ఆయకట్టుకు సాగునీరు అందాలి

Aug 21 2026 12:22 AM | Updated on Aug 21 2026 12:22 AM

పాన్‌గల్‌: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చివరి ఆయకట్టు వరకు సాగునీరు సాఫీగా పారేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. గురువారం మండలంలోని రేమద్దుల, కిష్టాపూర్‌, గోప్లాపూర్‌లోని కేఎల్‌ఐ డీ–8, ఎంజే–4 కాల్వలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పేరుకపోయిన పూడిక తొలగించడంతో పాటు కాల్వలపై లష్కర్లను నియమించాలని అధికారులకు సూచించారు. వనపర్తి వైపు వెళ్లే సాగునీటి కాల్వను ఎదుట్ల సమీపంలో బైక్‌పై వెళ్లి మంత్రి పరిశీలించారు. కాల్వలో నీరు అధికంగా పారుతుండటంతో చివరి ఆయకట్టుకు చేరడం కొంత ఇబ్బందిగా ఉంటుందని.. అటు వైపు వెళ్లే నీటి ప్రవాహాన్ని కొంత తగ్గించాలన్నారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలని, నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు. తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలే వేయాలన్నారు. కాల్వలకు నీరు నవంబర్‌ వరకే వస్తుందని రైతులకు సూచించారు. మంత్రి వెంట జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్‌ గోవర్ధన్‌సాగర్‌, కాంగ్రెస్‌పార్టీ మండల నాయకులు వెంకటేష్‌ నాయుడు, రవికుమార్‌, పుల్లారావు, మధుసూదన్‌రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, నీటి పారుదలశాఖ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement