కొత్తకోట రూరల్: జిల్లా రవాణాశాఖ అధికారి సురేష్‌కుమార్ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని జాతీయ రహదారిపై విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలకు జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ సురేష్‌కుమార్ మాట్లాడుతూ.. జాతీయ రహదారిపై అధిక లోడుతో ప్రయాణించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను ప్రయాణికులను తరలించేందుకు వినియోగించవద్దని సూచించారు. హైవేపై వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్‌గన్స్ ఏర్పాటు చేశామని.. అధిక వేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించి జరిమానాలు విధిస్తున్నామన్నారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇచ్చి సురక్షితంగా ప్రయాణించాలన్నారు.


