వనపర్తి రూరల్: పెద్దగూడెం శివారు తిరుమలయ్యగుట్టపై వెలిసిన వేంకటేశ్వరస్వామిని ఆదివారం జిల్లా ప్రధాన నాయ్యమూర్తి బాక శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కళార్చన, అడిషినల్ సీనియర్ న్యాయమూర్తి కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి కార్తీక్‌రెడ్డి, మొదటి అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీలత, రెండో అదనపు జూనియర్ నాయమూర్తి అశ్వని దర్శించుకున్నారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వా గతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ విశిష్టతను తెలియజేసి తీర్థప్రసాదాలు అందజేశారు.


