బడిలో ఉండాల్సిన చిన్నారులతో పనులు చేయిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. అధికారుల బృందం ఏటా రెండుసార్లు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తోంది. చిన్న పిల్లలతో పనులు చేయిస్తూ పట్టుబడితే యజమానులపై కేసులు నమోదు చేస్తాం. ఇప్పటి వరకు పలువురికి జరిమానాలు కూడా విధించాం.
– సుధారాణి, ఇన్‌చార్జ్ డీడబ్ల్యూఓ
●
వనపర్తి: బాల కార్మికులను గుర్తించి వారికి ఉజ్వల భవిష్యత్ అందించేందుకు ప్రభుత్వం 12 ఏళ్లుగా ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ నిర్వహిస్తోంది. ఆయా కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన అధికారుల బృందం 30 రోజుల పాటు జిల్లావ్యాప్తంగా ముమ్మర తనిఖీలు నిర్వహించి భిక్షాటన చేస్తున్న, ప్రమాదకర, సాధారణ పనులు చేస్తున్న బాలకార్మికులను గుర్తించి వారికి వసతితో పాటు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఒకవేళ ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తీసుకొచ్చి పనులు చేయిస్తే వారి సొంత ప్రాంతం, కుటుంబంతో కలిపే సౌకర్యాలను అధికారుల బృందం కల్పిస్తుంది. జిల్లాలో ఇప్పటి వరకు పేర్కొన్న ఘటనల్లో రాజస్థాన్ నుంచి వచ్చిన బాలలను ఎక్కువగా గుర్తించినట్లు తెలుస్తోంది.
ఏడాది పట్టుబడిన బాల కార్మికులు
బాలురు బాలికలు మొత్తం
2023 68 11 79
2024 42 04 46
2025 71 03 74
2026 9 – 9
ఆపరేషన్ ముస్కాన్‌లో గుర్తించిన బాలకార్మికులు
ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్.. జూలైలో ఆపరేషన్ ముస్కాన్
12 ఏళ్లుగా కొనసాగుతున్న తనిఖీలు
ఇప్పటి వరకు పట్టుబడిన చిన్నారులు 968
పని ప్రదేశం నుంచి నేరుగా పాఠశాలకే..


