ఓట్లు తొలగించేందుకు కుట్ర : బీఆర్‌ఎస్‌ | - | Sakshi
Sakshi News home page

ఓట్లు తొలగించేందుకు కుట్ర : బీఆర్‌ఎస్‌

Jul 10 2026 9:39 AM | Updated on Jul 10 2026 9:39 AM

ఆత్మకూర్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తున్నాయని.. అర్హులైన వారి ఓట్లు తప్పిపోకుండా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కార్యదీక్షతో ముందుకెళ్లాలని మక్తల్‌ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలో పార్టీ మండల అధ్యక్షుడు రవికుమార్‌యాదవ్‌ నివాసంలో నిర్వహించిన మండల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఎల్‌ఏలు బీఎల్వోలతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన వారి ఓట్లు నమోదు చేసుకునేలా సహకరించాలని సూచించారు. నియోజకవర్గంలో అభివృద్ధి పడకేసిందని.. హామీలే తప్ప అభివృద్ధి లేదని ఎద్దేవా చేశారు. పుర మాజీ చైర్‌పర్సన్‌ గాయత్రి, మాజీ ఎంపీపీలు బంగారు శ్రీనివాసులు, విరేష లింగం, మాజీ వైస్‌ ఎంపీపీ కోటేష్‌, యుగంధర్‌రెడ్డి, రామకృష్ణ, రియాజ్‌ అలీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement