పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు | - | Sakshi
Sakshi News home page

పరిస్థితులకు అనుగుణంగా పంటల సాగు

Jul 10 2026 9:39 AM | Updated on Jul 10 2026 9:39 AM

వనపర్తి: ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల ఆధారంగా రైతులు పంటల సాగు చేపట్టేలా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి సూచించారు. గురువారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్‌ పాల్గొని వివరాలు వెల్లడించారు. అనంతరం నీటిపారుదల, వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించి జూరాల, రామన్‌పాడు జలాశయాల్లో నీటినిల్వలు, రిజర్వాయర్లలోకి వస్తున్న వరద వివరాలను అడిగి తెలుసుకున్నారు. జూరాలకు ఎగువ నుంచి ఎలాంటి ప్రవాహం లేవని, మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు బాగా కురిస్తే ఆల్మట్టి నుంచి నీరు వదిలినప్పుడే వచ్చే అవకాశం ఉందని, అవి తాగునీటికి సరిపోతుందని ఇరిగేషన్‌ సీఈ రహీమొద్దీన్‌ వివరించారు. మండలాల వారీగా రైతులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేసే విధంగా అవగాహన కల్పించేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలన్నారు. మినుములు, కంది తదితర పంటలు సాగు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు. వీడియో కాన్ఫరెనన్స్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, డీఏఓ ఆంజనేయులు, ఉద్యానవ అధికారి విజయభాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement