వనపర్తిటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరుపేదలు ఎంతగానో లబ్ధి పొందుతున్నారని.. సీఎంఆర్‌ఎఫ్ వరమని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. చిన్నారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని తన నివాసంలో 111 మంది లబ్ధిదారులకు రూ.28.22 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను అందజేసి మాట్లాడారు. ఆరోగ్యశ్రీలో వైద్యం చేయించుకోలేని వారికి వైద్యఖర్చుల నిమిత్తం సీఎంఆర్‌ఎఫ్ అందజేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయశాఖలో 190 ఈఓ పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం పొందే విధంగా కృషి చేసిన చిన్నారెడ్డిని కార్యనిర్వహణాధికారులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధానకార్యదర్శి నందిమళ్ల యాదయ్య, డీసీసీ మాజీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు.


