పాలకులకు పట్టింపేది? | - | Sakshi
Sakshi News home page

పాలకులకు పట్టింపేది?

Mar 5 2026 8:53 AM | Updated on Mar 5 2026 8:53 AM

మంత్రి దృష్టికి తీసుకెళ్తా.. ఉన్నతాధికారులకు విన్నవించాం..

పనుల్లో కానరాని పురోగతి

ఒక్కో నిర్మాణానికి రూ.కోటి వ్యయం

బిల్లులు చెల్లించక నిలిచిన నిర్మాణాలు

పట్టణంలో వైకుంఠధామం నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. గత ప్రభుత్వ హయంలో మంజూరైనా.. బిల్లులు మంజూరుగాక కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తి చేయించేందుకు కృషి చేస్తా.

– జింక సువర్ణ రవి,

పుర చైర్‌పర్సన్‌, అమరచింత

వైకుంఠధామం నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. గత ప్రభుత్వంలో పనులు ప్రారంభించినా.. సమయానికి నిధులు రాక పనులు ఆగిపోయాయి. ఈ విషయాన్ని మరోమారు అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్తాం.

– శశిధర్‌, పుర కమిషనర్‌, ఆత్మకూర్‌

అమరచింతలో నిర్మాణంలో

ఉన్న వైకుంఠధామం

అమరచింత: పురపాలికల్లో స్థలాల కొరతతో భవిష్యత్‌లో మృతదేహాల ఖననానికి ఇబ్బందులు ఉండొద్దని భావించిన గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆధునిక వసతులతో వైకుంఠధామాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఒక్కోదానికి రూ.కోటి మంజూరు చేయగా.. అధికారులు టెండర్‌ ప్రక్రియ పూర్తి చేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్మాణాలు ప్రారంభించినా సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో నిర్మాణాలు అర్ధాంతంగా నిలిపివేశారు. జిల్లాలో కొత్తగా ఏర్పడిన అమరచింత, ఆత్మకూర్‌, కొత్తకోట, పెబ్బేరు పురపాలికల్లో నిర్మాణ పనులు 65 నుంచి 70 శాతం వరకు పూర్తవగా.. మిగిలిన పనులు అటకెక్కాయి. దీనికితోడు ప్రభుత్వం మారడంతో పనులు పూర్తిగా మరుగునపడినట్లయింది. రెండేళ్ల కిందట నిర్మాణాలకు శ్రీకారం చుట్టినా.. విడతల వారీగా బిల్లులు చెల్లిస్తారన్న ఆశతో కాంట్రాక్టర్లు పనులు ప్రారంభించారు. బిల్లులు రాక పెట్టుబడి భారంగా మారడంతో పనులు నిలిపివేశారు. కొత్తకోట, అమరచింత, ఆత్మకూర్‌లో 75 శాతం పనులు జరిగాయని, పెబ్బేరులో 30 శాతం కూడా పూర్తి కాలేదని సంబంధిత అధికారులు తెలిపారు. కాని వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. మూడు పురపాలికల్లో 50 శాతం పనులు మాత్రమే జరిగాయని తెలుస్తోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, బిల్లులు చెల్లించకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.

జిల్లాలో అసంపూర్తిగా వైకుంఠధామాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement