మెనూ విధిగా పాటించాలి | - | Sakshi
Sakshi News home page

మెనూ విధిగా పాటించాలి

Mar 5 2026 8:53 AM | Updated on Mar 5 2026 8:53 AM

పాన్‌గల్‌: విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని డీఆర్డీఓ, మండల ప్రత్యేక అధికారి ఉమాదేవి అన్నారు. బుధవారం మండల కేంద్రలోని కస్తూర్బా విద్యాలయను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు, విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, స్టాక్‌ రూంలోని నిత్యావసర సరుకులు, గడువు తేదీ, భోజనాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రోజు మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. పదోతరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తూ ఉత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలని కోరారు. వంటగది ప్రహరీ పక్కన మురుగు నిల్వతో దుర్వాసన వస్తుందనే విషయాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లగా పరిశీలించి మురుగు నిల్వకుండా సాఫీగా ముందుకు సాగేలా పైపులైన్‌ ఏర్పాటు చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్‌ఓ హేమలత, ఏపీఓ కుర్మయ్య, పంచాయతీ కార్యదర్శి నరేష్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement