కేంద్ర మంత్రి పర్యటనతో..
నీతి ఆయోగ్ సంపూర్ణ అభియాన్ కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న 10 జిల్లాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ గతేడాది డిసెంబర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా నర్వ మండలంలోని రాయికోడ్‌లో డిసెంబర్ 27న పర్యటించి సంపూర్ణ అభియాన్ ద్వారా అమలవుతున్న పథకాలను లబ్ధిదారులు, చిన్నారులను అడిగి తెలుసుకొని కేంద్రానికి నివేదిక అందించారు. దీంతో జాతీయ స్థాయిలో నర్వ మండలానికి అభివృద్ధి పరంగా ప్రత్యేక నిధులు రాబట్టేందుకు ఈ కార్యక్రమం దోహదపడింది.
నర్వ మండలంలో సంపూర్ణ అభియాన్ పనులను పరిశీలిస్తున్న
కేంద్రమంత్రి బండి సంజయ్ (ఫైల్)


