‘సప్తశేష వాహనం’పై రంగనాథస్వామి
వనపర్తి రూరల్: శ్రీరంగాపురం రంగనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం అర్చకులు స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. ఉదయం మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ శ్రీవారి మూలమంత్ర హవనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం సర్వాలంకరణ శోభితుడు, సమస్త లోకాధిపతి అయిన రంగనాథస్వామి ఉభయ నాంచారీ సమేతుడై సప్త శేషవాహనంపై తిరువీధుల్లో విహరించారు. దివ్యతేజ స్వరూపుడైన స్వామివారిని భక్తులు పెద్దసంఖ్యలో దర్శించుకున్నారు. అర్చకులు విష్ణునారాయణ, కిట్టుస్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
శనేశ్వరాలయానికి పోటెత్తిన భక్తులు
బిజినేపల్లి: నందివడ్డెమాన్ జైష్ట్యాదేవి సమేత శనేశ్వరాలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తమ ఏలినాటి శనిదోష నివారణ కోసం శనేశ్వరుడికి తిల తైలాభిషేకాలు నిర్వహించి.. గోత్ర నామార్చనలు చేశారు. అనంతరం బ్రహ్మసూత్ర శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు గవ్వమఠం విశ్వనాథశాస్త్రి పాల్గొన్నారు.
వేగంగా ఇందిరమ్మ
ఇళ్ల నిర్మాణం
ఆత్మకూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రాజెక్టు డైరెక్టర్ విఠోభా అన్నారు. శనివారం పట్టణంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మండలంలోని 13 గ్రామపంచాయతీలకు 302 ఇళ్లు మంజూరుకాగా, 228 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు. త్వరితగతిన పూర్తిచేసేలా సంబంధిత అధికారులు లబ్ధిదారులను ప్రోత్సహి ంచాలని సూచించారు. ఆయన వెంట ఎంపీడీఓ శ్రీపాద్, ఎంపీఓ శ్రీరాంరెడ్డి, హౌసింగ్ ఏఈ రాజేశ్వరి పాల్గొన్నారు.
‘సప్తశేష వాహనం’పై రంగనాథస్వామి
‘సప్తశేష వాహనం’పై రంగనాథస్వామి


