సకలకళా సురభిలు
జటప్రోల్, కొల్లాపూర్ సంస్థానాలుగా సురభిరాజుల ప్రజారంజక పాలన
రాచరిక పాలన అంటే సంప్రదాయాలు, కట్టుబాట్లు, బానిసత్వం ఉంటాయి.. కానీ, కొల్లాపూర్‌ను శతాబ్దాల పాటు పాలించిన సురభి రాజవంశస్థులు అందుకు భిన్నంగా స్వేచ్ఛాయుత పాలన అందించారు. ఆధ్యాత్మికతను పెంపొందిస్తూ.. కళలకు పట్టం కట్టి.. అధునాతన వసతులతో ఆదర్శవంతమైన పాలన సాగించారు.. ఆ కాలంలోనే కొల్లాపూర్‌లో వంద ఫీట్ల వెడల్పాటి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ నిర్మాణం, ఆస్పత్రి వసతులు కల్పించారంటే వీరి ముందుచూపు ఏపాటిదో ఊహించవచ్చు. అలాగే దక్షిణ భారతంలోనే మద్రాస్, నిజాం పాలకుల తర్వాత విమానం కొనుగోలు చేసిన ఘనత వీరికే దక్కింది. ఆధునికతతోపాటు ఆధ్యాత్మికత, తెలుగు భాష పరిరక్షణకు పెద్దపీట వేసిన సురభిరాజ వంశస్తుల ప్రజారంజక పాలనపై ‘సాక్షి’ సండే స్పెషల్ కథనం..
– కొల్లాపూర్
● స్వాతంత్య్రానికి
ముందే కొల్లాపూర్‌లో
డబుల్ లైన్ రోడ్లు,
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, ఆస్పత్రి ఏర్పాటు
● దక్షిణ భారతంలో
మద్రాస్, నిజాం పాలకుల
తర్వాత విమానం
కొనుగోలు చేసింది వీరే..
● ఆధ్యాత్మికతతోపాటు తెలుగు భాష పరిరక్షణకు పెద్దపీట
● కళలకు పట్టం..
ఉద్యానవనాల
సాగుకు బీజం


