ఉచిత వైద్య శిబిరాలతో మేలు
వనపర్తి టౌన్: ఉచిత వైద్య శిబిరాలతో ఎంతోమందికి మేలు చేకూరనుందని.. ఇలాంటి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత కోరారు. శనివారం కోర్టు ఆవరణలో జిల్లా న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో మెడికవర్ ఆస్పత్రి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ సంయుక్తంగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించగా.. ఆమె ముఖ్యఅతిథిగా ఆమె హాజరై ప్రారంభించి మాట్లాడారు. కోర్టులో న్యాయ సేవలతో పాటు వైద్య సేవలను అందించినట్లు అవుతుందని, ఎంతో సంతోషకర విషయమని తెలిపారు. ముఖ్యంగా ఉద్యోగులు ఆరోగ్య పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. శిబిరంలో సుమారు 200 మందికిపైగా వైద్య సేవలు అందించినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.కిరణ్‌కుమార్ వివరించారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్, జిల్లా వైద్యాధికారి డా. సాయినాథ్‌రెడ్డి, న్యాయమూర్తులు కళార్చన, రజని, శ్రీలత, అశ్విని, న్యాయవాదులు మోహన్‌గౌ డ్, మోహన్‌కుమార్, తిరుపతిగౌడ్, దినేష్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, రాజు, భరణి, వంశీగౌడ్ పాల్గొన్నారు.
129 మంది
విద్యార్థులు గైర్హాజరు
వనపర్తిటౌన్: జిల్లాలో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షకు 129 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు డీఐఈఓ ఎర్ర అంజయ్య తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఏర్పాటు చేసిన 25 పరీక్ష కేంద్రాల్లో 5,655 మంది విద్యార్థులకుగాను 5,526 మంది హాజరయ్యారన్నారు. జనరల్ విద్యార్థులు 4,637 మందికిగాను 4,538 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 99 మంది హాజరు కాలేకపోయారు. ఒకేషనల్ విద్యార్థులు 1,018 మందికిగాను 988 మంది విద్యార్థులు హాజరుకాగా.. 30 మంది గైర్హాజరయ్యారు. డీఐఈఓ రూరల్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి ప్రశ్నపత్రాల తరలింపును పరిశీలించారు. పాన్‌గల్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, వనపర్తిలోని రావూస్, అభ్యాస్, జాగృతి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈసీ బృందం జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌ను, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల, శ్రీ సూర్య, స్కాలర్స్, త్రివేణి జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం కొత్తకోటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, నివేదిత, ప్రతిభ, పెబ్బేర్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాలను, సిట్టింగ్ స్క్వాడ్ బృందం పాన్‌గల్, ఖిల్లాఘనపురం, వీపనగండ్ల, ఆత్మకూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. జిల్లాలోని అన్ని కేంద్రాల్లో పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయని డీఐఈఓ పేర్కొన్నారు.
ఉచిత వైద్య శిబిరాలతో మేలు


