జాతీయ సమైక్యత క్యాంపునకు ఎంపిక
వనపర్తిటౌన్: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కో–ఎడ్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ 4 వలంటీర్లు బి.శివరాజ్, ఎం.మురారి జాతీయ సమైక్యత క్యాంపునకు ఎంపికయ్యారని ప్రోగ్రాం అధికారి ధాంసింగ్ తెలిపారు. శనివారం వారికి కళాశాలలో ప్రిన్సిపాల్ రఘునందన్ క్యాంపు పత్రాలను అందజేశారు. ఈ నెల 24 నుంచి మార్చి 2 వరకు రాయచూర్ ఆదికవి శ్రీ మహర్షి వాల్మీకి యూనివర్సిటీలో వారం పాటు నిర్వహించే జాతీయ సమైక్యత క్యాంపునకు హాజరవుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఉమా, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


