జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారులు

Feb 22 2026 8:46 AM | Updated on Feb 22 2026 8:46 AM

జాతీయ

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారులు

వనపర్తి: గుజరాత్‌లోని వడోదరాలో ఈ నెల 24 నుంచి 28వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు పెబ్బేరు మండలం కంచిరావుపల్లికి చెందిన డి.శివకుమార్‌, ఆత్మకూర్‌ మండలం మూలమళ్లకు చెందిన టి.శివకృష్ణ ఎంపికయ్యారు. ఈ నెల 6 నుంచి 8వ తేది వరకు కరీంనగర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలో ఉత్తమ ప్రతిభ కనబర్చి జాతీయస్థాయి సీనియర్స్‌ విభాగం కబడ్డీ జట్టులో రాష్ట్రం తరుఫున ఆడనున్నారు. క్రీడాకారులను ఉమ్మడి జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ కార్యదర్శి కురుమూర్తిగౌడ్‌, జిల్లా కబడ్డీ అసోసియేషన్‌ చైర్మన్‌ దేశాయి పద్మజారెడ్డి, అధ్యక్షుడు పి.వెంకటేశ్వర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎం.కురుమయ్య అభినందించారు.

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ

ఆకస్మిక తనిఖీ

వనపర్తి రూరల్‌: పెబ్బేరులోని రాఘవేంద్ర, జనని ప్రైవేట్‌ ఆస్పత్రులను శనివారం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కానింగ్‌ కేంద్రాలు, రికార్డులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. ఆస్పత్రుల్లో సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని, సాధారణ కాన్పులకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైతేనే సిజేరియన్‌ చేయాలని సూచించారు. ఆయన వెంట ఆస్పత్రి సిబ్బంది ఉన్నారు.

ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యే జీఎంఆర్‌

దేవరకద్ర: దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు, నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై ముఖ్యమంత్రితో చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలోని మూడు మున్సిపాలిటీలను కాంగ్రెస్‌పార్టీ కై వసం చేసుకోవడంపై అభినందించినట్లు చెప్పారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు వివరించారు. సీఎంను కలిసిన వారిలో కాంగ్రెస్‌ నాయకులు పాపయ్యగారి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్‌ శేఖర్‌రెడ్డి, సర్పంచ్‌లు మాసన్న, యాదగిరిరెడ్డి తదితరులు ఉన్నారు.

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హాజరుకానున్న 31,804 మంది విద్యార్థులు

ఆన్‌లైన్‌లో అందుబాటులో హాల్‌టికెట్లు

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారులు 
1
1/2

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారులు

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారులు 
2
2/2

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement