వేణిసోంపురం
గ్రామం పేరు
వెలుగులోకి..
మహిమాన్వితం..
మరో మంత్రాలయంగా ఖ్యాతిగడించిన మారుమూల గ్రామం
● నదీతీరంలో చరిత్ర
కలిగిన వేణుగోపాలస్వామి ఆలయం
● రెండు పాయలుగా
చీలి తుంగభద్ర నది ప్రవాహం
● వెంకట రామాచార్యుల
రాకతో మారిన
రూపురేఖలు
● నదీగర్భంలో కలిసిపోయిన నల్లని రాతిబండలు
ఉమ్మడి పాలమూరులోని జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని వేణిసోంపురం గ్రామం
ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది. వేణిసోంపురం గ్రామాన్ని గతంలో సోంపురంగా పిలిచేవారు. ఈ గ్రామానికి కుడిపక్క తుంగభద్ర నది, ఎడుమ పక్కన నల్లని రాతిబండ ఉండేది. పక్కనున్న కేశవరం గ్రామం నుంచి సోంపురం మీదుగా పెద్దధన్వాడ వరకు సుమారు 9 కిలోమీటర్ల మేర నల్లని రాతిబండలు జడలా అల్లుకొని ఉండడంతో గ్రామానికి వేణిసోంపురం అనే పేరు వచ్చింది. సంస్కృతంలో
వేణి అంటే జడ, పురం అంటే గ్రామం అని అర్థం.
– అలంపూర్ (అయిజ)
తుంగభద్ర నది వేణిసోంపురం గ్రామం సమీపంలో రెండు పాయలుగా విడిపోయి పారుతుండడం విశేషం. వ్యాసతత్వ తీర్థులకు వృద్ధాప్యం రావడంతో కి.మీ. దూరంలో ఉన్న నదికి ప్రతిరోజు ఉదయం, సాయత్రం వెళ్లి స్నానం చేసి స్వామివారి పూజలు చేయడం కష్టంగా అనిపించింది. అప్పుడు వ్యాసతత్వ తీర్థులు ఒక కర్రను తీసుకొని స్వామివారి ముందు పెట్టి ప్రత్యేక పూజలు చేసి అనంతరం నదిలోకి వెళ్లి ఆ కర్రతో ఆయన ఇంటి వరకు గీత గీశారు. అప్పుడు నుంచి తుంగభద్ర నదీ ప్రవాహం రెండు పాయలుగా చీలి ఒక పాయ వ్యాసతత్వ తీర్థుల ఇంటిని ఆనుకొని పారుతుందని చరిత్రలో రాయబడింది. అలాగే కాలక్రమంలో నదిలో ఇసుకమేటలు వేయడంతో రాతిబండలు కనిపించకుండాపోయాయి.
●
వేణుగోపాలస్వామి ఆలయం నిర్మించడంతో ఆ ప్రదేశానికి ప్రత్యేకత ఏర్పడి ఆ గ్రామం పేరు వెలుగులోకి వచ్చింది. ఆలయ నిర్మాణానికి ముందు చుట్టూ ప్రదేశాల్లో అక్కడక్కడ కొన్ని ఇళ్లు మాత్రమే ఉండేవి. కాలక్రమేణా ఆ ప్రాంతంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి కొంతమంది వచ్చి ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రస్తుతం గ్రామంలో సుమారు 800 జనాభా ఉంది. గ్రామం పక్కన నది ప్రవహిస్తుండడంతో గ్రామస్తులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వేణిసోంపురం
వేణిసోంపురం
వేణిసోంపురం


