ముగిసిన రెవెన్యూ సదస్సులు
గోపాల్‌పేట: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూ భారతిలో భాగంగా రెవెన్యూ సదస్సుల నిర్వహణకు పైలెట్ మండలంగా గోపాల్‌పేటను ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 5 నుంచి 13 వరకు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించి రైతుల నుంచి అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. మంగళవారం చివరిరోజు మండల కేంద్రంతో పాటు బుద్దారం గ్రామంలో సదస్సులు కొనసాగగా.. గోపాల్‌పేటలో 39, బుద్దారం గ్రా మంలో 67 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు మండల వ్యాప్తంగా మొత్తం 590 దరఖాస్తులు వచ్చినట్లు తహసీల్దార్ పాండు తెలిపారు. మంగళవారంతో దరఖాస్తుల స్వీకరణ ముగిసిందని.. సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్ తిలక్‌కుమార్‌రెడ్డితదితరులు పాల్గొన్నారు.


