అభివృద్ధికి సహకరించాం.. ఆదుకోండి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి సహకరించాం.. ఆదుకోండి

Jun 24 2024 12:24 AM | Updated on Jun 24 2024 12:24 AM

అభివృద్ధికి సహకరించాం.. ఆదుకోండి

అభివృద్ధికి సహకరించాం.. ఆదుకోండి

వనపర్తి: జిల్లాకేంద్రంలో కలెక్టరేట్‌, మెడికల్‌, నర్సింగ్‌ కళాశాల తదితర భవన నిర్మాణాలకు తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూములను త్యాగం చేశామని.. ఒప్పందం ప్రకారం న్యాయం చేయాలని రైతులు ఆదివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డికి వినతిపత్రం అందజేశారు. రైతుల అభ్యర్థన మేరకు ఆదివారం ఆయన మెడికల్‌ కళాశాల నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించి వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. చేసుకున్న ఒప్పందం ప్రకారం.. గత ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన స్థలాలకు సంబంధించిన పట్టాలు ఇచ్చిందని, నేటికీ ప్రభుత్వం ఎన్‌ఓసీ జారీ చేయకపోవటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వివరించారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని ఆయన కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభికి సిఫారస్‌ చేశారు. సర్వేనంబర్‌ 200, 86లో రైతులకు ఇచ్చిన పట్టాలను రెగ్యులరైజ్‌ చేసేందుకు తనవంతుగా ప్రభుత్వ పెద్దలతో చర్చించి న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. జెడ్పీ చైర్మన్‌ ఆర్‌.లోక్‌నాథ్‌రెడ్డి రైతులకు మద్దతు తెలిపి వారితో పాటు డా. చిన్నారెడ్డిని కలిశారు. కార్యక్రమంలో రైతులు సూర్యానాయక్‌, శంకర్‌నాయక్‌, చందు, జనార్దన్‌, వశ్యానాయక్‌ తదితరులు ఉన్నారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడికి రైతుల వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement