● కనుల పండువగా అమ్మవారి దర్శనం
కొత్తవలస: మండలంలోని వీరభద్రపురం గ్రామంలో కొలువైన సర్వమంగళ సమేత వీరభ్రస్వామి ఆలయంలో కొలువైన సర్వమంగళదేవి అమ్మవారికి కార్తీక మాసం సందర్భంగా బుధవారం లక్ష గాజులతో ప్రత్యే కంగా అలంకరించారు. ఆలయ పురోహితులు కావలి రవికుమార్‌శర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులో ప్రవేశాలకు కౌన్సెలింగ్
విజయనగరం ఫోర్ట్: ఎంపీహెచ్‌డబ్ల్యూ (ఎఫ్) (మల్టిపర్పస్‌హెల్త్ వర్కర్‌ఫిమేల్) కోర్సులో ప్రవేశాలకు బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. దీనికి డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీనరాణి, సర్వజన ఆస్పత్రి ఇన్‌చార్జి ఏడీ ఎర్రాజీరావు, డీఎంహెచ్‌ఓ కార్యాలయం సూపరింటెండెంట్ మీసాల నాగరాజు హాజరయ్యారు. కన్వీనర్ కోటా 48 సీట్లకు 24 మంది శ్రీ సత్యసాయి ఎంపీహెచ్‌డబ్లూ (ఎఫ్) ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్(విజయనగరం), ఎస్.కోటకు చెందిన వెంకట పద్మావతి ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లలో ప్రవేశాలు పొందారు.


