వేపాడ మండలం పాటూరు, బొద్దాం గ్రామాలకు కుళాయిల నుంచి 15 రోజులుగా బురద నీరే సరఫరా అవుతోంది. తాటిపూడి ప్రాజెక్టు నుంచి నుంచి వచ్చే పైపులైన్ల నుంచి బురద నీరు సరఫరా అవుతుండడంతో తాగునీటికి కటకటలాడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదంటూ స్థానిక మహిళలు తెలిపారు. గతంలో ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. ఇదే విషయాన్ని తాటిపూడి ప్రాజెక్టు ఏఈ శైలజ వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా వివిధ సాంకేతిక సమస్యలతో బురద నీరు సరఫరా అవుతోందని, గురువారం నుంచి స్వచ్ఛమైన తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. – వేపాడ


