జెడ్పీ పీఠం కోసం కొప్పులవెలమల పట్టు! | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ పీఠం కోసం కొప్పులవెలమల పట్టు!

Nov 12 2026 5:18 AM | Updated on Nov 12 2026 5:18 AM

విజయనగరం అర్బన్‌: జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవి కొప్పుల వెలమ సామాజిక వర్గంలో రాజకీయ ఆశలను పెంచుతోంది. జిల్లాలో తమ సామాజిక వర్గానికి గణనీయమైన జనాభా, రాజకీయ బలం ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వంలో కీలక పదవుల్లో తగిన ప్రాతినిధ్యం దక్కలేదన్న అసంతృప్తితో ఉంది. ఈ నెల 20న జరగనున్న జెడ్పీ చైర్‌పర్సన్‌ ఎన్నికలో బీసీ మహిళా రిజర్వేషన్‌ కింద తమ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని డిమాండ్‌ చేస్తోంది.

7 స్థానాల్లో ప్రాతినిధ్యం

జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాలకు బొండపల్లి, గంట్యాడ, బొబ్బిలి, ఎస్‌.కోట, ఎల్‌.కోట, వేపాడ, విజయనగరం స్థానాల్లో కొప్పుల వెలమ అఽభ్యర్థులు విజయం సాధించారు. బాడంగి, జామి, కొత్తవలస, మెంటాడ స్థానాలు రిజర్వేషన్ల వల్ల అవకాశాన్ని కోల్పోయారు. ఈ లెక్కన 27 స్థానాల్లో పది స్థానాలపై తమ సామాజికవర్గానికి రాజకీయంగా ప్రాతినిధ్యం ఉందని, జెడ్పీపీఠానికి తమ వర్గం వారికి కేటాయించాలని ఆ సంఘ నాయకులు పట్టుబడుతున్నారు.

పదవి కేటాయించాల్సిందే..

విజయనగరం ఫోర్ట్‌: జెడ్పీ చైర్మన్‌ పదవిని కొప్పల వెలమ సామాజిక వర్గానికి కేటాయించాలని కొప్పల వెలమ సంక్షేమ సంఘ జిల్లా కన్వీనర్‌ బూసర్ల వెంకటరమణరావు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక కొప్పల వెలమ సంక్షేమ సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా రాజకీయాల్లో, అభివృద్ధిలో తమ సామాజికవర్గం కీలకపాత్ర పోషిస్తోందన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో ఇద్దరు ఎమ్మెల్యేలు (ఎస్‌.కోట, బొబ్బిలి), డీసీసీబీ చైర్మన్‌ పదవులు కొప్పల వెలమలకే కేటాయించారన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ఎస్‌.కోట ఎమ్మెల్యే ఒక్కరే కొప్పల వెలమకు చెందిన వారు ఉన్నారని, డీసీసీబీ చైర్మన్‌ పదవి వేరే సామాజిక వర్గానికి కేటాయించారని తెలిపారు. జిల్లాలో భారీ సంఖ్యలో ఉన్న బీసీ వర్గానికి ఏ ఒక్క కీలక పదవీ లభించకపోవడం అన్యాయమన్నారు. సమావేశంలో సంఘ నాయకులు మేళాపు శ్రీహరినాయుడు, జి. రామారావు, ఎం.ఎస్‌ నాయుడు. పెద్దింటి సుగుణాకరరావు, వైకుంఠం వెంకటనాయుడు, తదితరులు పాల్గొన్నారు.

కూటమి తీరుపై ఆగ్రహం

కొప్పుల వెలమలకు రాజకీయ ప్రాధాన్యం ఇవ్వడంలో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తు న్నారు. ఎమ్మెల్యే స్థానాల నుంచి ఎంపీ స్థానం, మంత్రి పదవి వరకు ఏ ఒక్క స్థానాన్ని ఇవ్వలేదని పేర్కొన్నారు. జిల్లా జనాభాలో సుమారు 40 శాతం వాటా కలిగిన బీసీ–డీ కొప్పుల వెలమలకు రాజకీయంగా తగిన గుర్తింపు ఇవ్వాలని కోరుతున్నారు.

27 జెడ్పీటీసీ స్థానాల్లో 11 తమవేనంటూ ఆ

వర్గనేతల వాదన

ఏడుగురు విజయం..

రిజర్వేషన్లతో మరో నాలుగు స్థానాలు

కోల్పోయామని వెల్లడి

కీలక పదవుల్లో

ప్రాతినిధ్యం ఇవ్వని కూటమిపై అసంతృప్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement