ఓటుతో తిరుగుబాటు | - | Sakshi
Sakshi News home page

ఓటుతో తిరుగుబాటు

Nov 10 2026 1:31 AM | Updated on Nov 10 2026 1:31 AM

మంగళవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 చంద్రబాబు పాలనపై.. ఓటుతో తిరుగుబాటు మంచి డిమాండ్‌

న్యూస్‌రీల్‌

ఓటుతో తమ వ్యతిరేకత తెలిపిన సామాన్యులు, ఉద్యోగ వర్గాలు జిల్లాలో పరిషత్‌ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్‌ సీపీల మధ్య ఓట్ల తేడా 6,048 జననేతపై తగ్గని ప్రజాభిమానం

ఇదీ లెక్క...

విజయనగరం
మంగళవారం శ్రీ 10 శ్రీ నవంబర్‌ శ్రీ 2026
చంద్రబాబు పాలనపై..

మన్యం అరటి మహారుచిగా ఉంటుందనే పేరుంది. ఈక్రమంలో మైదాన ప్రాంత రైతులతో సమానంగా అరటి పంటను గిరిజన రైతులు కొండపోడు వ్యవసాయంలో పండిస్తున్నారు.

విజయనగరం రూరల్‌:

అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లకే చంద్రబాబు పాలనపై తిరుగుబాటు మొదలైంది. ప్రభుత్వ ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై సామాన్యులు, ఉద్యోగులు ఓటుతో తమ నిరసన తెలిపారు. దీనిని అధిగమించేందుకు... కూటమి అభ్యర్థులను గెలిపించుకునేందుకు చంద్రబాబు అండ్‌ కో అడ్డదారులు తొక్కారు. ఎన్నికల నియమనిబంధనలను పక్కనపెట్టి అధికార బలంతో ప్రత్యర్థులను భయపెట్టారు. ఏకగ్రీవాలకు ప్రయత్నించారు. చాలా చోట్ల రిగ్గింగ్‌కు పాల్పడ్డారు. కౌంటింగ్‌ కేంద్రాల్లో రీకౌంటింగ్‌ పేరుతో ఫలితాలను తారుమారు చేశారు. అధికారులపై ఒత్తిడి పెంచి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారు. ఇన్ని చేసినా పరిషత్‌ పోరులో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోరాటపటిమను చూపించాయి. ప్రజాబలంతో ముందుకు సాగాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలను సొంతం చేసుకున్నాయి.

మూడు పార్టీలు ఏకమైనా...

స్థానిక సంస్థల ఎన్నికల్లో మూడు పార్టీలు ఏకమైనా ప్రజల్లో వైఎస్సార్‌సీపీపై ఉన్న అంచలంచల విశ్వాసం ఏమాత్రం తగ్గలేదని నిరూపితమయ్యింది. ఒకపక్క అధికార యంత్రాంగమంతా అధికార పార్టీకి అన్ని విధాల అండదండల అందించినా, ప్రలోభాలకు గురిచేసినా ఫ్యాన్‌ గుర్తుకే ఓటేసి వైఎస్సార్‌ సీపీపై అభిమానాన్ని చాటుకున్నారు. జిల్లాలో గత సాధారణ ఎన్నికల కంటే ఓట్ల శాతం పెరగడం గమనార్వం.

జిల్లాలో 27 మండలాల్లో 27 జెడ్పీటీసీ స్థానాలకు, 449 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీకి 4,19,528 ఓట్లు రాగా, వైఎస్సార్‌సీపీకి 4,13,480 ఓట్లు పోలయ్యాయి. అయితే టీడీపీ 21 సీట్లు సాధించగా, వైఎస్సార్‌సీపీ ఐదు స్థానాలు గెలుచుకుంది. అనేక చోట్ల అధికార పార్టీ నేతలు, నాయకులు బెదిరింపులకు దిగినా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇచ్చిన పిలుపుమేరకు ధైర్యంతో ముందుకు సాగారు. ప్రజాక్షేత్రంలో తమ బలాన్ని నిరూపించుకోవడమే కాకుండా, ప్రజలకు పార్టీపై ఉన్న అభిమానం చెక్కు చెదరలేదని ఈ ఎన్నికలు రుజువు చేశాయని స్పష్టమైంది. కూటమి పార్టీలో ఒకటైన జనసేనకు కేవలం 72 వేలు ఓట్లు మాత్రమే పోలవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement