విజయనగరం గంటస్తంభం: అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు కూడా జాబితాలో పేరు కోల్పోకూడదనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి తెలిపారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్‌ఐఆర్)–2026లో భాగంగా గైర్హాజరు, వలస, మరణం, డూప్లికేట్ కేటగిరీల్లో ఏఎస్‌డీడీ జాబితాలో గుర్తించిన ఓటర్లు తమ అర్హతను నిరూపించే పత్రాలను సమర్పించి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు. నవంబర్ 30న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామని వెల్లడించారు.
విజయనగరం రూరల్: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఎన్నికల సంఘం కసరత్తును వేగవంతం చేసింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల కోసం ఎన్నికల గుర్తుల జాబితాను సిద్ధం చేసింది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థుల కోసం 25 గుర్తులు, వార్డు సభ్యుల కోసం 20 గుర్తులను అధికారికంగా ఖరారు చేసింది. ఈ నెల 26, 29, డిసెంబర్ 2వ తేదీల్లో మొత్తం మూడు విడతల్లో పంచాయతీ పోలింగ్ జరగనుంది. ఓటర్లు తమ అభీష్టాన్ని తెలిపేందుకు ఈ గుర్తుల జాబితాకు అదనంగా బ్యాలెట్ పత్రంలో నోటా ఆప్షన్‌ను కూడా చేర్చనున్నారు. ఒకవేళ ఏదైనా స్థానంలో పోటీచేసే అభ్యర్థుల సంఖ్య కేటాయించిన గుర్తుల కంటే పెరిగితే, ఎన్నికల సంఘం రిజర్వు జాబితా నుంచి మరిన్ని గుర్తులను కేటాయించనుంది.
కేటాయించిన ఎన్నికల గుర్తుల వివరాలు...
●సర్పంచ్ అభ్యర్థుల గుర్తులు: మంచం, కత్తెర, ఉంగరం, బుట్ట, వంకా య, కప్పూ సాసరు, క్యారెట్, తాళం చెవి, గొలుసు, కుర్చీ, బ్యాట్, టెలిఫోన్, బల్ల, మొక్కజొన్న, పలక, ద్రాక్షపళ్లు, తిరగలి, కుండ, అరటిపండు, కొవ్వొత్తులు, నల్లబోర్డు, అనాసపండు, షటిల్, చేతికర్ర, చెంచా.
●వార్డు సభ్యుల గుర్తులు(20): ప్రెష ర్ కుక్కర్, గౌను, స్టూల్, ఇసీ్త్రపెట్టె, పోస్ట్ డబ్బా, గ్యాస్ స్టౌ, బీరువా, ఐస్క్రీమ్, కెటిల్, కటింగ్ ప్లేయర్, విద్యుత్ స్తంభం, గరాటా, డిష్ యాంటెన్నా, రంపం, కెమెరా, క్యారమ్ బోర్డు, వయోలిన్, బెండకాయ, బెల్టు, కోటు. నామినేషన్లు, గుర్తుల కేటాయింపు పూర్తయితే గ్రామాల్లో ఎన్నికల ప్రచార వేడి మరింత ఊపందుకోనుంది.


