వంగర: మడ్డువలస గొర్లె శ్రీరాములునాయు డు ప్రాజెక్టు వద్ద రెండు గేట్లు ఎత్తి 7వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నామని ఏఈ నితిన్ సోమవారం తెలిపారు. సువర్ణముఖి, వేగావతి నదుల నుంచి 5,600 కూసెక్కుల నీరు ప్రాజెక్టులో చేరుతోంది. దీంతో రెండు గేట్లుఎత్తి 7వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడిచిపెడుతున్నారు. సాగునీటి అవసరాల కోసం కుడి ప్రధాన కాలువకు 300 క్యూసెక్కు ల నీటిని సరఫరా చేస్తున్నామని ఏఈ తెలిపా రు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద 64.55 మీటర్ల నీటిమట్టం నమోదైందన్నారు.
విజయనగరం లీగల్: సమాజంలో ప్రతిఒక్కరికీ న్యాయసేవలు అందుబాటులో ఉండేలా చేయడమే న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన లక్ష్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్‌ఎస్‌ఏ చైర్‌పర్సన్ ఎం.బబిత స్పష్టం చేశారు. జాతీయ న్యాయసేవల దినోత్సవాన్ని జిల్లా న్యాయసేవాధికార సంస్థ (డీఎల్‌ఎస్‌ఎ) ఆధ్వ ర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడినవారు, మహిళలు, పిల్లలు, వృద్ధులు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయం అందిస్తూ న్యాయం పొందే అవకాశాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. ఉచిత న్యాయ సహాయంతో పాటు లోక్ అదాలత్‌లు, బాధితులకు పరిహారం, మధ్యవర్తిత్వం ద్వారా వివాదాల పరిష్కారం వంటి సేవలు అందిస్తున్నామని వివరించారు. గ్రామాలు, పాఠశాలలు, కళాశాలలు, జైళ్లు, పునరావాస కేంద్రాల్లో న్యాయ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యాయం పొందడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డంకి కాకూడదని, అర్హులంతా డీఎల్‌ఎస్‌ఏ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్లేపస్ చైర్మన్ జి.దుర్గయ్య, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి డాక్టర్ ఎ.కృష్ణప్రసాద్, బార్ ప్రెసిడెంట్ ఎన్.రమేష్ కుమార్, స్టేట్‌బార్ కౌన్సిల్ మెంబర్ బి.రవి, విజయనగరం డీఎస్పీ ఎస్.లక్ష్మణ మూర్తి, న్యాయమూర్తులు, న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, అంగన్‌వాడీ వర్కర్లు పాల్గొన్నారు.


