రబీ సాధారణ సాగు విస్తీర్ణం
ఇప్పటివరకు సాగైంది 1133 హెక్టార్లు
విజయనగరం ఫోర్ట్: రైతన్నకు కాలం కలిసిరావడంలేదు. ఓ వైపు ప్రభుత్వం నుంచి సహకారం శూన్యం కాగా... మరోవైపు ప్రకృతి కూడా అనుకూలించడంలేదు. ఖరీఫ్ తొలిసీజన్లో వర్షాభావంతో పంటలు సాగుకాలేదు. ఇప్పుడు తుఫాన్ వర్షాలతో రబీ సాగు ఆలస్యమైంది. వాస్తవంగా సెప్టెంబర్ నెల నుంచే రబీ పంటలు సాగుకావాలి. ఈ ఏడాది చాలా తక్కువగా సాగైంది. ఖరీఫ్ సీజన్ సాగు ఆలస్యం కావడంతో దానిప్రభావం రబీసీజన్పైనా పడింది. ఖరీఫ్ సీజన్లో వర్షాలు ఆలస్యంగా కురవడం వల్ల సెప్టెంబర్ నెలఖారు వరకు పంటలు సాగవ్వలేదు. ముఖ్యంగా వరి పంటసాగు చాలా ఆలస్యం అయింది. ఒక దశలో పంటలు సాగువుతాయో లేదోననే సందేహం నెలకొంది. ఈ ఏడాది నవంబర్ వచ్చినా రబీ సీజన్ ఆరంభం కాలేదు. ఖరీఫ్ సీజన్ మాదిరి రబీసీజన్లో పంటలు పూర్తిస్థాయిలో సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు.
జిల్లాలో రబీసీజన్లో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 62,633 హెక్టార్లు. ఇంతవరకు 1133 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. పంటల సాగు ఆలస్యంగా ప్రారంభం కావడం వల్ల మందకొడిగా సాగుతోంది.
62,633 హెక్టార్లు


