పెదగనగళ్లవానిపేట సముద్ర తీరంలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు
ఇద్దరూ ఇంజినీరింగ్ మూడో ఏడాది విద్యార్థులే
సెల్ఫీ మోజు..
శ్రీకాకుళం రూరల్/రాజాంసిటీ/భామిని: సెల్ఫీ మోజు ఇద్దరు విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చి ంది. విహారానికి వెళ్లిన విద్యార్థులకు విషాదం ఎదురైంది. శ్రీకాకుళం పరిధిలోని పెదగనగళ్లవానిపేట గ్రామం వద్ద సముద్ర తీరంలో ఎచ్చెర్లలో ని శ్రీ వెంకటేశ్వర కాలేజీలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ బీటెక్ చదువుతున్న విద్యార్థులు జి.మణికంఠ (22), జె.మనోజ్ (21) గల్లంతయ్యారు. వీరిలో మణికంఠది పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం ఘనసర కాగా.. మనోజ్‌ది విజయనగరం జిల్లా రాజాం.
సోమవారం సాయంత్రం 4 గంటలకు కాలేజీ విడిచిపెట్టాక మూడు బైక్‌లపై ఏడుగురు విద్యార్థులు ఈ బీచ్‌కు వచ్చారు. బీచ్‌లో సెల్ఫీలు దిగు తూ సందడిగా గడిపారు. మణికంఠ, మనోజ్, నిఖిల్ ముగ్గురూ కలిసి గ్రోయిన్ నిర్మాణం గుండా నడుచుకుంటూ చివరి వరకు వెళ్లారు. అప్పటికే స్థానిక మత్స్యకారులు సముద్రంలోకి దిగవద్దని, చాలా ప్రమాదంగా ఉందని హెచ్చరించినప్పటికీ ఎవ్వరూ వినిపించుకోలేదు. ఇంతలో మణికంఠ గ్రోయిన్ చివరిలో గల రాళ్ల మీదకు దిగి సెల్ఫీకి ప్రయత్నించాడు. అక్కడ నాగావళి నది సముద్రం కలిసే ప్రాంతంలో ప్రమాదవశాత్తు జారిపోయాడు. అతడిని పట్టుకోబోయి మనోజ్ కూడా నీటిలో పడిపోయాడు. అప్పటికే కెరటాలు ఉద్ధృతంగా ఎగసి పడుతున్నాయి. స్నేహితులు చూస్తుండగానే వీరు సముద్రంలో మునిగిపోయారు. నిఖిల్ అనే స్నేహితుడు రక్షించే ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది. వారు ఎంత సేపు వేచి చూసినా వారి మృతదేహా లు బయటకు రాలేదు. దీంతో మిగిలిన మిత్రు లు కుటుంబ సభ్యులకు సమాచారం అందించా రు. సంఘటన స్థలానికి శ్రీకాకుళం డీఎస్పీ ధనుంజయనాయుడు, మైరెన్ సీఐ బోర ప్రసాద్, టౌన్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ సురేష్‌లు చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
అందివస్తాడనుకుంటే అందని లోకాలకు..
మృతుడు మణికంఠ తల్లిదండ్రులు సరస్వతి, జగన్నాథం వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివి స్తున్నారు. కుమార్తె భామినిలో చదువుతుండగా, కొడుకు ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తుండడంతో సంతోషపడ్డారు. అందివస్తాడనుకున్న కొడుకు సముద్రంలో గల్లంతుకావడంతో కన్నీరుపెడుతున్నారు.


