చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యం

Oct 19 2026 1:25 AM | Updated on Oct 19 2026 1:25 AM

చంద్రబాబు హయాంలో అభివృద్ధి శూన్యం

స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం తప్పదు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కొత్తపాలెంలో టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు కనిమెరక జనసేన మండల నాయకులు కూడా..

బొండపల్లి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ హయాంలో రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి శూన్యం అని, దీన్ని ప్రజలంతా గమనిస్తున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మండలంలోని కొత్తపాలెం గ్రామంలో ఇటీవల పార్టీలో చేరిన మాజీ వైస్‌ ఎంపీపీ, టీడీపీ సీనియర్‌ నాయకుడు బొడ్డు రాము అనుచరులు 150 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో ఆదివారం చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ బొత్స అప్పలనరసయ్య అధ్యక్షతన గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. వీరితో పాటు కనిమెరక గ్రామానికి చెందిన జనసేన పార్టీ మండల నాయకులు బగ్గా ఎర్రయ్య, గోగ్గు శ్రీనివాసరావు తమ అనుచరులతో చేరగా పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

మాయ మాటలతో...

కూటమి ప్రభుత్వంలో నాయకులు, ప్రజాప్రతినిధులు మాయ మాటలు, కల్లబొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తూ.. ప్రజలను మోసం చేస్తున్నారని బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్న ధ్యాస లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

అండగా ఉంటాం..

వైఎస్సార్‌సీపీలోని ప్రతి ఒక్కరికీ పార్టీ అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడొద్దని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బొత్స సత్యనారాయణ అన్నారు. కూటమి ప్రభుత్వ బెదిరింపులకు ఎవరూ భయపడేవారు లేరన్నారు. రాబోయేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే అని జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. పార్టీ శ్రేణులు ఒక్క తాటిపై నిలబడి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలో చేరిన కరాచి పైడితల్లిని తమ పార్టీ మద్దతుతో కొత్తపాలెం సర్పంచ్‌ అభ్యర్థిగా ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్‌, మాజీ ఎంపీపీ చల్లా చలంనాయుడు, పార్టీ మండల అధ్యక్షుడు బొద్దల చిన్నంనాయుడు, నాయకులు ములపర్తి రమణ, బొడ్డు సత్యవతి, వేమలి వెంకటరావు, సాలపు పెంటంనాయుడు, మంత్రి గోవింద, మహంతి రమణ, పల్లి రఘు, బొడ్డు మాధవ్‌, పలు గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ, టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన 150 కుటుంబాల వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానిస్తున్న బొత్స సత్యనారాయణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement